Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- భువనగిరిరూరల్
భువనగిరి మండలం పెంచికల్ పహాడ్ గ్రామ పరిధిలోని రామకష్ణపురంలో సీపీఐ(ఎం) జెండా దిమ్మను కూల్చడానికి ప్రయత్నించిన ఉప సర్పంచ్ గడ్డం కొండల్ రెడ్డి పై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్య తీసుకోవాలని ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం మండల పార్టీ ఆధ్వర్యంలో రామకష్ణాపురం గ్రామానికి వెళ్లి కూల్చివేతకు ప్రయత్నించిన జెండా దిమ్మను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు, మూడు గ్రామాలకు సంబంధించిన రైతాంగం, వ్యవసాయ కూలీలు, కార్మికులు, గ్రామ ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం గ్రామ ప్రజలందరూ 1992లో సీపీఐ(ఎం) స్తూపాన్ని నిర్మించారన్నారు. గ్రామానికి చెందిన గడ్డం కొండల్ రెడ్డి తమ బాయి దగ్గర నిర్మాణం చేసుకున్న ఎక్స్పోజ్ గోదాముల దగ్గరికి వెళ్లడానికి వేరే దారి ఉన్నా సీపీఐ(ఎం)జెండాపైన అక్కస్తో గురువారం ఉదయం జెండా దిమ్మెను తొలగించడానికి గడ్డపారతో చుట్టూతవ్వి కూల్చడానికి ప్రయత్నం చేశాడని తెలిపారు. ఎర్రా జెండాను తొలగించాలని ప్రయత్నం చేసిన కొండల్ రెడ్డి పై వెంటనే కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల కార్యదర్శివర్గ సభ్యురాలు కొండమడుగు నాగమణి, మండల కమిటీ సభ్యులు సిలివేరు ఎల్లయ్య, ఎల్లంల వెంకటేష్, గ్రామ శాఖ కార్యదర్శి సుబ్బురు పోషయ్య పాల్గొన్నారు.