Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ -తిరుమలగిరి
మండల కేంద్రంలోని బాలాజీ పంక్షన్హాల్లో గురువారం ్త నియోజకవర్గంలోని 9 మండలాలకు చెందిన ఆశాకార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా 306 మంది ఆశా వర్కర్లకు స్మార్ట్ ఫోన్లు , చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాదరికిశోర్‌కుమార్ మాట్లాడుతూ ఆరోగ్య తెలంగాణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో కోవిడ్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో వైద్య శాఖకు తోడుగా ఆశ కార్యకర్తలు నిలబడి సహకారం అందించడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీచైర్‌పర్సన్ గుజ్జ దీపికా యుగేందర్ రావు,రాష్ట్ర ఆయిల్ ఫెడ్చైర్మెన్ కంచర్ల రామకష్ణ రెడ్డి,జిల్లా రైతు బంధు సమితి కోఆర్డినేటర్ ఎస్.ఏ రజాక్,జిల్లా వైద్యాధికారులు లు డాక్టర్లు కోటాచలం, కొండల్ రావు,సాంబశివరావు, టీఎంఈఓ కార్యదర్శి సుదర్శన్, డిప్యూటీ డీఎంహెచ్ఓ లు హర్షవర్ధన్, వేణుగోపాల్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు సైదులు మరియు సంబంధిత అధికారులు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.