Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ తోటకూరి అనురాధ, షెడ్యూల్ కులాల అభివద్ధి స్టాండింగ్ కమిటీ చైర్పర్సన్
నవతెలంగాణ -భువనగిరి
ఎస్సీ, ఎస్టీ అభివద్ధి, సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ్ షెడ్యూల్ కులాల అభివద్ధి స్టాన్డింగ్ కమిటీ చైర్ పర్సన్ తోటకూరి అనురాధ అన్నారు.గురువారం జిల్లా కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో ఆక్షన్ఎయిడ్ ఇండియా వారి ఆధ్వర్యంలో షెడ్యూల్ కులాల అభివద్ధి శాఖ ,ఎస్సీ కార్పొరేషన్ అధికారులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎస్సీ కార్పొరేషన్ లబ్ధిదారులకు గ్రౌండింగ్ పూర్తి చేసేందుకు సత్వర చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.షెడ్యూల్ కులాల అభివద్ధి అధికారి జయపాల్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో తమ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో అమలు అవుతున్న పథకాలను వంద శాతం అమలు చేస్తామన్నారు. ఈసంవత్సరం అంబేద్కర్ ఓవర్సీస్ పథకం ద్వారా ముగ్గురు విద్యార్థులను విదేశీ విద్యకు ఎంపిక చేశామన్నారు. స్కాలర్ షిప్ పథకం 76 శాతం పూర్తి చేశామన్నారు.ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యామ్ సుందర్ మాట్లాడుతూ స్వయం ఉపాధి పథకాలు సద్వినియోగం చేసుకొని ఉపాధి పొందాలన్నారు. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాలో సుమారు 3,600 ఎకరాల భూమిని కొనుగోలు చేసి పంపిణీ చేశామన్నారు. ఆక్షన్ ఎయిడ్ జిల్లా కో ఆర్డినేటర్ సురుపంగ శివలింగం అధ్యక్షత న నిర్వమించిన ఈ కార్యక్రమంలో జిల్లా బాలల సంరక్షణ అధికారి సైదులు, సీడబ్ల్యుసీ సభ్యులు ఎర్ర శివరాజ్, పిలువు సంస్థ బాధ్యులు జనార్దన్, కో ఆర్డినేటర్ అనూష, రిటైర్డ్ ఎంఈఓ బండారు రవివర్ధన్, తదితరులు పాల్గొన్నారు.