Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ అందుబాటులో లేని సీఈవో. ఫోన్ స్విచ్ఆఫ్ చేసిన చైర్మెన్
అ రికార్డులు మాయం
నవతెలంగాణ -నేరేడుచర్ల
మండలంలోని చిల్లపల్లి సహకార సంఘం పరిధిలో వచ్చిన అవినీతి ఆరోపణలుపై జిల్లా సహకార సంఘం అధికారి శ్రీధర్ విచారణకు ఆదేశించారు. గురువారం విచారణ అధికారిగా అసిస్టెంట్ రిజిస్ట్రార్ బి.రాజ శ్రీ తోపాటు జూనియర్ ఇన్స్పెక్టర్ సంధ్యారాణి సహకార సంఘానికి వచ్చారు. కానీ విచారణకు హాజరు కావలసిన సీఈఓ, చైర్మెన్ అందుబాటులో లేరు. సిబ్బందిని వాకబు చేయగా సీఈఓ అనారోగ్యం కారణంగా ఈ నెల 26 వరకు సెలవులో ఉన్నట్టు తెలిపారు. చైర్మెన్‌కు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుందని ,రికార్డుల గురించి సిబ్బందిని అడుగగా ధాన్యం కొనుగోలుకు సంబంధించిన రికార్డులు సీఈఓ తన ఇంటివద్దే ఉంచుకుంటారని, ఆఫీసుకు తీసుకురారని తెలియజేశారు. విచారణకు అధికారులు వచ్చిన విషయం తెలుసుకున్న డైరెక్టర్లు సహకార సంఘానికి చేరుకొని ధాన్యం కొనుగోళ్లపై అవినీతి జరిగిందని దీనిపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని అధికారులకు విన్నవించారు. ప్రస్తుతం విచారణ చేయలేకపోతున్నామని విచారణ వాయిదా వేస్తున్నట్టు విచారణ అధికారి రాజశ్రీ తెలియజేశారు. అధికారులకు విన్నవించినా డైరెక్టర్లు చింతకుంట్ల వీరారెడ్డి, పేర్వాల రంగారెడ్డి , కొండా పిచ్చయ్య రైతులు వల్లభ రెడ్డి వెంకన్న తదితరులు ఉన్నారు.