Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి
అ పలు అభివద్ధి పనుల శంకుస్థాపన
నవతెలంగాణ-మోటకొండూర్
రైతులు రైతు వేదికను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే , ప్రభుత్వ విప్ గొంగిడి సునీతమహేందర్రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని చందేపల్లిలో నిర్మించిన రైతు వేదికను ఆమె ప్రారంభించారు. అదేవిధంగా దిలాల్పురం, మాటూరు, ఇక్కుర్తి, అమ్మలబోలు, వర్టూరు, చందేపల్లి, చామాపూర్, తేర్యాల, గ్రామాల్లో పలు అభివృద్ధి పనులు, సీసీరోడ్లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒక రైతు వేదికను నిర్మించిందన్నారు. ఇప్పటి వరకు మండలంలోని రైతులకు మొత్తంగా 100.18 కోట్ల రూపాయలు పెట్టుబడి సాయంగా వచ్చినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు బంధు సమితి అదేక్షులు కోలుకుల అమరేందర్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అనురాధ, యాదగిరి గుట్ట డివిజన్ ఏడిఏ డి. పద్మావతి, మండల వ్యవసాయ అధికారి ఎస్. సుజాత,ఎంపీపీ పైళ్ల ఇంద్ర సత్యనారాయణరెడ్డి, జెడ్పీటీసీ పల్లా వెంకట్ రెడ్డి, వైస్ ఎంపీపీ ఇల్లందుల మల్లేష్, టీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భైరోజు వెంకటా చారి,తదితరులు పాల్గొన్నారు.