Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ కలెక్టర్ పమేలా సత్పతి
నవతెలంగాణ- ఆలేరుటౌన్
మున్సిపల్ అభివద్ధికి ప్రణాళికాబద్ధంగా పాలకవర్గ సభ్యులు కషి చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు . గురువారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో 2022-23 బడ్జెట్, 2021-22 సంవత్సరం బడ్జెట్ సవరణ ఆమోదం సమావేశంను మున్సిపల్ చైర్మెన్ వస్పరి శంకరయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆలేరు మున్సిపాలిటీ అభివద్ధికి ప్రభుత్వం నుండి మరిన్ని నిధులు మంజూరయ్యేలా కషి చేస్తానన్నారు.శిథిలావస్థలో ఉన్న మున్సిపాలిటీ కార్యాలయాన్ని మరొక చోటికి తరలించాలని , అధికారులను ,పాలకవర్గ సభ్యులకు సూచించారు . ఆదాయం రూ 1386.89 మొత్తం వ్యయం 1386.39, మిగులు 0.50తో 2022-23 అంచనా బడ్జెట్ , 2021-22 సవరణ బడ్జెట్‌ను కలెక్టర్ సమక్షంలో పాలకవర్గ సభ్యులు ఆమోదించారు .అనంతరం కలెక్టర్‌ను మున్సిపల్చైర్మెన్ పాలకవర్గం సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మారుతీ ప్రసాద్ , వైస్ చైర్మెన్ మొరిగాడి మాధవి , వార్డు కౌన్సిలర్లు చింతలపని సునీత ,ఎర్ర దయామణి, బేతి రాములు, గుత్తా శమంత ,సంగు భూపతి ,రాయపూరము నర్సింహులు ,దాసి నాగలక్ష్మి, కందుల శ్రీకాంత్ ,జూకంటి శ్రీకాంత్, కౌన్సిల్ సభ్యులు దొంతి బ్యూలా రాణి ,బింగి లత ,సీసా రాజేష్, ఎండి.రియాజ్, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు .