Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఎస్పీ రాజేంద్రప్రసాద్
అ రోడ్డు భద్రతపై అధికారులతో సమీక్ష
నవ తెలంగాణ- సూర్యాపేట
రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యత అని ఎస్పీ ఎస్.రాజేంద్రప్రసాద్ అన్నారు.జిల్లాలో.రోడ్డు భద్రత,ప్రమాదాల నివారణ పై గురువారం స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో జాతీయ రహదారి 65 ని కలిగిన పోలీసు స్టేషన్ సంభందిత అధికారులు, జాతీయ రహదారుల సంస్థ,జిఎమ్మార్ సంస్థ అధికారులతో ఎస్పీ సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణ పట్ల సంభందిత శాఖల అధికారులు, సిబ్బంది బాధ్యతగా పని చేయాలని చెప్పారు. జిల్లాలో నమోదౌతున్న రోడ్డు ప్రమాదాల కేసుల దష్ట్యా సిబ్బంది అందరూ సమన్వయంతో పని చేసి, ప్రమాదాల నివారణకు అవసరమైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సూచించారు.రోడ్డు ప్రమాదాల బ్లాక్ స్పాట్స్ పై జిల్లా అదనపు ఎస్పీ అధ్వర్యంలో నివేదిక తయారు చేసినట్టు వెల్లడించారు. జిల్లాలో తరచుగా ప్రమాదాలు సంభవిస్తున్న సుమారుగా 29 వరకు బ్లాక్ స్పాట్స్, ప్రమాదాలకు గల కారణాలను,రోడ్డు ఇంజనీరింగ్ లోపాలను, నిర్వహణ లోపాలను గుర్తించినట్టు పేర్కొన్నారు. వాటిని సరిచేసి ప్రమాదాలను నివారించడానికి బాధ్యతగా పని చేయాలని అన్నారు. రోడ్డుపై సూచిక బోర్డుకు ఏర్పాటు,ప్రమాద స్థలాలు తెలిపే మ్యాప్ లు, మలుపులు, జంక్షన్ లు, డైవర్షన్ లు ఉన్నట్లు ప్రయాణికులకు, వాహనదారులకు ముందుగానే తెలిసేలా బోర్డులను ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ సమావేశంలో అధనపు ఎస్పీ రితిరాజ్, డీఎస్పీలు రఘు,మోహన్ కుమార్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్్ శ్రీనివాస్, సీఐలు విఠల్ రెడ్డి, ఏ. ఆంజనేయులు, నర్సింహారావు, ఆంజనేయులు,పిఎన్డి ప్రసాద్, సూర్యాపేట రూరల్, చివ్వేంల, మునగాల ఎస్సైలు, సూర్యాపేట, కోదాడ ట్రాఫిక్ ఎస్సై లు,డీసీఆర్బీ ఎస్సై శ్రీనివాస్,పీసీఆర్ ఎస్సై డానియల్,జిఎమ్మార్ అధికారులు,ఎన్ హెచ్ ఏ ఐ అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.