Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఆయన మందిర నిర్మాణానికి ప్రభుత్వ భూమితోపాటు నిధులు కేటాయిస్తాం
అ మంత్రి జగదీశ్‌రెడ్డ్డి
నవతెలంగాణ -సంస్థాన్‌నారాయణపురం
సంత్ సేవాలాల్ సమాజ మార్పు కోసం పోరాడిన గొప్ప త్యాగమూర్తి అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి కొనియాడారు. గురువారం మండల కేంద్రంలోని జైహింద్ గార్డెన్లో నిర్వహించిన గిరిజనుల ఆరాధ్య దైవంగా భావించే సంత్ సేవాలాల్ 283వ జయంతి వేడుకకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక ముఖ్యమంత్రిగా కె.చంద్రశేఖర రావు అన్ని కుల, మత, తెగలకు అతీతంగా గౌరవ మర్యాదలు అందజేస్తున్నారు. మానవ విలువల మనుగడకు కేసీఆర్ చేస్తున్న కషి గొప్పదన్నారు. ప్రపంచ దేశాలు కేసీఆర్ చేపట్టే కార్యక్రమాల వైపు ఆకర్షితులవుతున్నారన్నారు. అందులో భాగమే సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలన్నారు. సంత్ సేవాలాల్ గిరిజన తెగ తో పాటు సమాజ మార్పు కు ఎంతో కషి చేసినట్టుతెలిపారు. సంత్ సేవాలాల్ మందిర నిర్మాణం కోసం ఒక ఎకరం భూమి కేటాయించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. మందిర నిర్మాణానికి అవసరమైన నిధులను ముఖ్యమంత్రితో మాట్లాడి తీసుకొచ్చే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ తన సొంత నిధులు రూ రూ.10 లక్షలు కేటాయించి వచ్చే జయంతి నాటికి సంత్ సేవాలాల్ భవనం నిర్మాణం చేస్తానని గిరిజనులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, మాజీ భువనగిరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్, భువనగిరి జెడ్పీచైర్మెన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, వైస్చైర్మెన్్ బిక్కు నాయక్, కలెక్టర్ పమేలా సత్పతి, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి మంగ్తా నాయక్, చౌటుప్పల్ మున్సిపల్ చైర్మెన్వెన్ రెడ్డి రాజు, ఆర్టీవో సూరజ్ కుమార్, ఎంపీపీ గుత్తా ఉమా ప్రేమ్ చందర్ రెడ్డి, జెడ్పీటీసీ వీరమల్ల భానుమతి వెంకటేష్, వైస్‌ఎంపీపీ రాజు, స్థానిక సర్పంచ్ శ్రీహరి,పీఏసీఎస్ చైర్మెన్లు జక్కిడీ జంగారెడ్డి, దొడ యాదిరెడ్డి, చౌటుప్పల్ ఎంపీపీ తాడూరు వెంకట్ రెడ్డి , చండూరు మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ జగన్ నాయక్, పాల్గొన్నారు.