Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
నేటి యువత ప్రభుత్వ ఉద్యోగాలపై మాత్రమే ఆధారపడకుండా స్వయం శక్తితో ఎదగాలని తెలంగాణ రాష్ట్ర ఎస్సీకో ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ బి.ఆనంద్ కుమార్ సూచించారు .రైజ్ సంస్థ, రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల సంస్థ అద్వర్యంలో శిక్షణ పొంది, ఉత్తీర్ణులైన విద్యార్థులకు సర్టిఫికెట్, ఉపాధి ధ్రువపత్రాలను గురువారం జిల్లా కేంద్రంలో పంపిణీచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సహకారంతో నిరుద్యోగులకు నాణ్యమైన శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే రైడ్ సంస్థ లక్ష్యం అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏడేళ్ల కాలంలో 6వేల మంది నిరుద్యోగ యువకులకు రూ. 32వేల కోట్ల డిఫెన్స్‌తో పాటు వివిధ రంగాల్లో శిక్షణ నిర్వహించినట్టు స్పష్టం చేశారు. అందుకు జిల్లాలో ఉన్న ఎస్సి నిరుద్యోగ యువత ప్రభుత్వాలు కల్పించే ఇటువంటి సదావకాశాలను ఉపయోగించు కోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీి కో -ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంచాలకులు బి.శిరీష ,రైజ్ సంస్థ సీఈఓ కన్నన్, విద్యార్థులు పాల్గొన్నారు.