Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ముత్తిరెడ్డి కుంటకి చెందిన వైద్య విద్యర్థి అజరు ఉక్రైన్ ఎంబీబీఎస్‌లో ఆఖరి సంవత్సరం చదువుతున్నాడు. రష్యా -ఉక్రైన్ యుద్ధం నేపథ్యంలో గురువారం ఇండియా వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. ఇంతలో యుద్ధం ప్రారంభించగా ఫ్లైట్ లన్ని రద్దయినట్లు విద్యార్థి తండ్రి బాలస్వామి గురువారం మిర్యాలగూడలో విలేకరులకు తెలిపారు. మరో మూడు నెలల్లో చదువు పూర్తి కానున్న తరుణంలో రష్యా యుద్ధం ప్రారంభించిందన్నారు. ఇండియా వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకోగా విమాన సర్వీస్ లు రద్దయినట్లు తన కుమారుడు ఫోన్ ద్వారా తెలిపినట్టు పేర్కొన్నారు. తెలంగాణ, ఏపీతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వేలాది మంది విద్యార్థులు ఉక్రైన్లో చిక్కుకున్నారని, భారత ప్రభుత్వం చొరవ చూపి విద్యార్థులను క్షేమంగా ఇండియా కి తీసుకు రావాలని కోరారు.