Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ జెడ్పీ చైర్మెన్ బండా నరేందర్ రెడ్డి ,
ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
నవతెలంగాణ-నార్కట్‌పల్లి
గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పననే ప్రధాన ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని నల్లగొండ జిల్లా ప్రజా పరిషత్ చైర్మెన్ బండా నరెేందర్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పేర్కొన్నారు. నార్కట్‌పల్లి మండలంలో రూ.80 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు వారు గురువారం శంకుస్థాపన చేశారు. ఎల్లారెడ్డిగూడెం గ్రామంలో 15 లక్షలు, పోతినేనిపల్లి గ్రామంలో 5 లక్షలు, నెమ్మాని గ్రామంలో 10 లక్షలు, జువ్విగూడెం గ్రామంలో 50 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను వారు ప్రారంభించారు. అనంతరం వారు గ్రామస్తులతో మాట్లాడుతూ గ్రామంలో ఉన్న ప్రధానమైన అన్ని రోడ్లను, డ్రెయినేజీలను పూర్తి చేస్తామని అన్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్దఎత్తున నిధులను కేటాయిస్తుందని తెలిపారు,
సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
అనంతరం మండలంలోని తొండ్లాయి, పోతినేనిపల్లి, షాపల్లి గ్రామాలకు చెందిన పలువురు అనారోగ్య కారణంగా సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రత్యేక చొరవతో మంజూరు అయిన 4 లక్షల విలువ గల చెక్కులను వారి గ్రామాలలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, జెడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి బాధిత కుటుంబాలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ సూదిరెడ్డి నరెందర్ రెడ్డి , ఎంపీడీవో గుండగొని యాదగిరి గౌడ్, మాజీ ఎంపీపీ రేగట్టె మల్లికార్జున్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు బైరెడ్డి కర్ణాకర్ రెడ్డి, చిట్యాల మార్కెట్ కమిటీ వైస్ చైర్మెన్ కొండూరు శంకర్, ఎంపీటీసీలు మేకల రాజి రెడ్డి, చిరుమర్తి యాదయ్య, పుల్లెంల ముత్తయ్య, చింత దేవకమ్మ, సర్పంచులు మేడి పుష్ప శంకర్, ఆదిమల్ల లింగస్వామి, గంట్ల నర్సి రెడ్డి , సూదిరెడ్డి ప్రేమలత, నరేందర్ రెడ్డి, కర్ణాటి ఉపేందర్, ఉప సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి , వడ్డె భూపాల్ రెడ్డి, నాయకులు బద్దం రాంరెడ్డి, బత్తుల అనంత రెడ్డి, మేకల కర్ణాకర్ రెడ్డి పాల్గొన్నారు.
గ్రామ పంచాయతీ మారినా సమస్యలు తీరలేదు
మండల పరిధిలోని మాధవఎడవల్లి గ్రామ పంచాయతీ నుంచి ఆవాస గ్రామమైన పోతినేని పల్లె గ్రామ పంచాయతీగా ఏర్పడినప్పటికీ గ్రామంలో రేషన్ షాపు ఏర్పాటు, పింఛన్ల పంపిణీ జరగటం లేదని ఆ గ్రామ సర్పంచ్, ఆదిమల్ల లింగ స్వామి, ప్రజలు ఆ గ్రామంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న జెడ్పీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డికి, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకి విన్నవించుకున్నారు. గ్రామంలో అదనంగా కరెంటు స్తంభాలు కావాలని కోరారు. పింఛన్ తీసుకోవడానికి ఎడవెల్లి గ్రామం వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో కావాల్సిన అదనపు స్తంభాలను వెంటనే ఏర్పాటు చేస్తామని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు. నెమ్మని గ్రామంలో అదనపు సీసీ రోడ్లు కావాలని, గ్రామంలో రహదారి వెంట ఉన్న కరెంటు స్తంభాలు లైన్ మార్చాలని కోరారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే అదనంగా సీసీ రోడ్లు వేసేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని పంచాయతీ రాజ్ ఏ ఈ పాల మోహన్‌కు ఆదేశించారు. జువ్విగూడెం గ్రామపంచాయతీ పరిధిలో గల కిస్టాపురం గ్రామంలో నివసిస్తున్న నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం నుంచి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఇవ్వాలని కోరారు.