Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మునుగోడు
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికి దిక్సూచిగా నిలిచాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని కిష్ణాపురం వేణుగోపాల స్వామి ఆలయ పాలక వర్గ ప్రమాణ స్వీకారానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై అనంతరం టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తో కలిసి ఆ గ్రామంలోని కళ్యాణ లక్ష్మి చెక్కులను మంజూరైన లబ్ధిదారుల ఇంటికి వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడబిడ్డ పుడితే అసహ్యించుకున్న తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కళ్యాణ లక్ష్మి పథకంతో వారి కళ్ళల్లో ఆనందం కనిపిస్తుందని అన్నారు. మిషన్ భగీరథ పథకంతో ఫ్లోరైడ్ భూతం మటుమాయం అయిందని అన్నారు. మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ వల్ల తెలంగాణాలో కరవు అన్నదే రాదని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ కర్నాటి స్వామి యాదవ్, జెడ్పీటీసీ నారాబోయిన స్వరూపరాణి రవి ముదిరాజ్ , బండా పురుషోత్తం రెడ్డి, ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి, తాసిల్దార్ జక్క ఆర్తి శ్రీనివాసులు, ఎంపీడీవో యాకూబ్ నాయక్, ఏడీఏ ఎల్లయ్య, ఏవో సుధగాని శ్రీనివాస్ గౌడ్, జాజుల అంజయ్య గౌడ్, బోయ లింగస్వామి, బోయ సతీష్ పాల్గొన్నారు.