Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ అడిషనల్ కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్
నవతెలంగాణ-కోదాడరూరల్
దళితబంధు లబ్ధిదారులకు వారు ఎంపిక చేసుకున్న స్కీమ్‌లో అనుభవం ప్రామాణికంగా పరిగణించాలని అడిషనల్ కలెక్టర్ హేమంత్ కేశవ పటేల్ గురువారం అన్నారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని గుడిబండ గ్రామంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో అధికారులతో మాట్లాడారు. దళిత బంధు లబ్ధ్దిదారుల అప్లికేషన్లు వారు పెట్టుకున్న స్కిం లను పరిశీలించారు. మార్చి చివరి వరకు గ్రౌండింగ్ పూర్తి కావాలని, త్వరితగతిన అప్లికేషన్లను ఆన్లైన్ చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో విజయశ్రీ, వెటర్నరీ డాక్టర్ నాగేంద్రబాబు, ఏవో రజని , ఆర్ఐ వెంకట నగేష్, ఎంపీవో పాండురంగన్న, కార్యదర్శులు ఫాతిమా, ఉపేందర్ సిబ్బంది పాల్గొన్నారు.