Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు
నవతెలంగాణ-మిర్యాలగూడ
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో అన్ని రంగాలను విస్మరించిందని ఈనెల 25న నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు, దీనిని విజయవంతం చేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరపల్లి వెంకటేశ్వర్లు కోరారు. గురువారం స్థానిక సీపీఐ(ఎం) కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్మిక ప్రజావ్యతిరేక విధానంగా ఉందని చెప్పారు. వ్యవసాయం, విద్య, వైద్య రంగాలకు బడ్జెట్ పెంచాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత బడ్జెట్ను సవరించాలని కోరారు. బ్యాంకులకు కార్పొరేట్ కంపెనీలు కట్టాల్సిన అప్పులు వెంటనే రికవరీ చేయాలని, పెట్రోల్, డీజిల్పై పెంచిన పన్నును తగ్గించాలని అన్నారు. పేదల సంక్షేమానికి నిధులు పెంచాలని కోరారు. జాతీయ ఆస్తుల నగదీకరణ అపాలని డిమాండ్ చేశారు. ఎరువులు, వంట గ్యాస్ సబ్సిడీ పెంచాలని కోరారు. ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచి వ్యవసాయ కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఐసీడీఎస్ పరిరక్షణ, అంగన్వాడీల భద్రత కోసం బడ్జెట్లో నిధులు పెంచాలని కోరారు. మధ్యాహ్న భోజన పథకానికి అత్యధిక నిధులు కేటాయించాలన్నారు. వీటి సాధన కోసం నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ నిరసనను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు రాగి రెడ్డి మంగారెడ్డి, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు పోలేబొయిన వరలక్ష్మి, సీపీఐ(ఎం) జిల్లా నాయకులు భవాండ్ల పాండు, ఆయూబ్, ఎండీ. అంజద్, సీఐటీయూ నాయకులు ముత్యాల లక్మి నారాయణ, కరిమున్నిసా బేగం, వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.