Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మద్దిరాల
మండలంలోని చిననెమిల,మద్దిరాల గ్రామాలకు చెందిన బోలాగాని పద్మ, సూరారపు సురేష్ లు ఇటీవలే అనారోగ్యంనికి గురై హాస్పిటల్లో చికిత్స పొందారు.వైద్య ఖర్చులు అధికం కావడంతో ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకోవడంతో ఇరువురికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూ రైన రూ.60 వేల చెక్కులను శుక్రవారం రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్ఏ.రజాక్ అందజేశారు.ఈ కార్య క్రమంలో జిల్లా గ్రంథాలయ డైరెక్టర్ దుగ్యాల రవీందర్రావు, సర్పంచుల ఫోరం మండలఅధ్యక్షులు కుందూరు విష్ణువర్థన్‌రెడ్డి, సర్పంచులు దామెర్లవెంకన్న, సురారపు గౌతమిరాజు, ఎంపీటీసీలు శిరంశెట్టి వెంకన్న, సుంచు అవిలయ్య, నాగెల్లిశ్రావణ్కుమార్, వడ్డాణం మధుసూదన్, మారెల్లి యాకయ్య, తిరుమల్‌రావు, దగ్గులవెంకన్న, జ్ఞానసుందర్ పాల్గొన్నారు.