Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చివ్వెంల
చివ్వెంల గ్రామపంచాయతీలో ఉపాధిహామీ పనులను జిల్లా గ్రామీణాభివద్ధి సంస్థ అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ పెంటయ్య శుక్రవారం పరిశీలించారు.అనంతరం మాట్లాడుతూ గ్రామ పంచాయతీలో హరితహారం, నర్సరీ అత్యంత సుందరంగా అన్ని బెడ్స్‌లో వివిధరకాల అందమైన మొక్కలతో వాటికి రక్షణగా గ్రీన్షెడ్ నెట్ ఏర్పాటు చేసి ఆకర్షణీయంగా మొక్కల పెంపకం నిర్వహిస్తున్న సమస్త సిబ్బంది, అధి కారులను, వారికి సహకరిస్తున్న గ్రామ పంచాయతీ సర్పంచ్‌ను ప్రశంసించారు.నర్సరీని ఆదర్శంగా తీసుకొని మండలంలోని అన్ని నర్సరీలలో మొక్కలను ఇదే మాదిరి ఆకర్శ ణీయంగా లక్ష్యం మేర పెంచేలా చర్యలు తీసు కోవాలని ఏపీఓను ఆదేశించారు. గ్రామ పంచాయతీ ప్రధాన రహదారి వెంబడి బహుళవరుసల్లో నాటడానికి సర్పంచ్ ప్రత్యేకంగా రాజమండ్రి కడియం నుండి తెప్పించిన మొక్కలు నాటారు.అనంతరం మండల పరిషత్ కార్యా లయంలో ఉపాధిహామీ సిబ్బందితో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొని నూతన సాంకేతికపోర్టల్ ప్రకారం పని ప్రదేశంలో పని కోసం డిమాండ్ కోరిన వారి పేర్లు మాత్రమే మస్టర్లో ఉండాలన్నారు. అలా కాకుండా పని అడిగినా.. అడుగకున్నా గ్రూపులోని సభ్యుల అందరి పేర్లను చేర్చినట్లు గుర్తించారన్నారు. డిమాండ్ చేసిన విషయం కూడా తెలియకుండా పనికి రాని వారు తమ 100 పనిదినాల్లో ఇలా పని చేయని రోజుల్ని నష్టపోతారన్నారు.వారు పనికి వచ్చినా రాకున్నా ఇలాగే డిమాండ్ చేసు కుంటూ పోతే అలా 100 రోజులు పూర్తైన తర్వాత నిజంగా వారు పనికి వస్తామని ముందుకు వచ్చినా అప్పటికే ఆన్లైన్లో 100 రోజులు పూర్త యినట్టు చూపిస్తుందన్నారు.కాబట్టి వారికి డిమాండ్ చేయడం కుదరదన్నారు.ఒక పని ప్రదేశంలో 20 మంది కూలీల కంటే ఎక్కువ సంఖ్యలో పని చేయించినచో ఒక వర్క్ సైట్ సూపర్వైజర్ని , 50 మంది దాటితే ఇద్దరు సూపర్వైజర్లని కేటాయించుకొని వారి ద్వారా పనులు చేయించి వారికి రోజుకి 245 రూపాయలు వేతనం ఇచ్చే అవకాశం నూతన పద్ధతిలో ఉన్నందున టెక్నికల్ అసిస్టెంట్లు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.ఎక్కువ సంఖ్యలో కూలీలకు పని కల్పించి మరికొందరికి అదనపు ఉపాధి, వారిని తమకు అసిస్టెంట్స్‌గా ఉపయోగించుకుంటూ సమర్థంగా పనులు నిర్వహించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఏపీఓ ఇరుగు నాగయ్య, సర్పంచ్ జూలకంటి సుధాకర్‌రెడ్డి,ఈసీ జ్యోతి, టీఏలు రమాదేవి, దుర్గాభవాని, విజరు, కార్యదర్శి రజిని గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.