Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండా శ్రీశైలం
నవతెలంగాణ-మర్రిగూడ
అమరవీరుల ఆశయాలు ఎప్పటికీ వృథా కావని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండా శ్రీశైలం అన్నారు. శుక్రవారం మండలంలోని కొండూరుకు చెందిన ముకురోజు వసంతాచారి మూడో వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి, స్తూపానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వసంతాచారి భౌతికంగా లేకపోయినా ఆయన పేద ప్రజల కోసం పని చేసిన తీరు చిరస్థాయిగా నిలిచి పోయిందని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా పోరాడిన వ్యక్తని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. దోపిడీ అవినీతి జరుగుతున్నంత కాలం ప్రజా సమస్యల పరిష్కారానికై ఎర్రజెండా ఎల్లవేళలా సమరశీల పోరాటాలు నిర్వహిస్తుందని తెలిపారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి సీపీఐ(ఎం) ఎళ్లవేళలా పాటుపడుతున్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు నాంపల్లి చంద్రమౌళి, మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య, ఆకుల వెంకట్రామ్, కొండూరు గ్రామ శాఖ కార్యదర్శి ఉప్పునూతల వెంకటయ్య, కొట్టం యాదయ్య, వి.భిక్షం, ఊరిపక్క వెంకటయ్య, ముకురోజు శ్రీనివాసచారి, శేఖర్ పాల్గొన్నారు.