Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేటరూరల్
మండలంలోని బాలెంల గ్రామసమ భావన సంఘం వీబీకే మామిడి వెంకటమ్మను విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ సమభావన సంఘం సభ్యులు కలెక్టరేట్లోని డీఆర్డీఏ సీనియర్ అసిస్టెంట్ కనకరత్నమ్మకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా పలువురు సభ్యులు మాట్లాడుతూ ఒక సమభావన సంఘానికి స్త్రీనిధి లోను మంజూరైతే లక్ష రూపాయలకు రూ.2 వేల చొప్పున కమీషన్ , బ్యాంకు లింకేజీకి ఒక సభ్యురాలి నుంచి రూ.500 చొప్పున వసూలు చేస్తుందని ఆరోపించారు. కమీషన్ రూపంలో ఎందుకు ఇవ్వాలని సభ్యులు ప్రశ్నిస్తే దురుసుగా మాట్లాడుతూ పైఅధి కారులకు ఇవ్వాలని వసూలు చేస్తుందని ఆరోపించారు. స్త్రీనిధి లోను అయిన మైక్రో లోను,సంఘ బంధం నుంచి లోను మంజూరు చేసిన చేసిన ఒక లక్ష రూపాయల లోనుకు రూ.2 వేల చొప్పున ప్రతి సంఘం నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతూ అలాగే ప్రభుత్వం నుంచి సమ భావనసంఘం సభ్యులకు వచ్చే లోన్సు గానీ ఇతర బెనిఫిట్స్ సభ్యులకు తెలుపకుండా తనకు అనుకూలంగా ఉన్న వారికి తన దగ్గర వ్యక్తులకు లోన్సు మంజూరు చేస్తుందని ఆరోపించారు.సమావేశం తన ఇంటి దగ్గర తప్ప ఎక్కడ నిర్వహించదన్నారు.ఇదే విషయమై గ్రామ ప్రజా ప్రతినిధులు, పై అధికారుల దష్టికి తీసుకెళ్లినప్పటికీ ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదన్నారు.వెంటనే అధికారులు స్పందించి ఆమెను విధుల నుంచి తొలగించి ఆమె స్థానంలో ఇతరులను నియమించాలని కోరారు.సుమారు బాలెంల 12 సమభావన సంఘాల సభ్యులు కోరారు.వినతిపత్రం అందజేసిన వారిలో సంఘం అధ్యక్షులు, మామిడి శశిరేఖ, నకిరేకంటి నాగమ్మ, పేరెల్లి సైదమ్మ, బొడ్డు రేణుక, ఇంద్రకంటి లక్ష్మమ్మ, శివమణి తదితరులు ఉన్నారు