Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చివ్వెంల
అండర్పాస్ వే నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం మండలంలోని అక్కల దేవిగూడెంలో రైతులు ధర్నా నిర్వహించారు.అనంతరం రైతు లు మాట్లాడుతూ అండర్పాస్ నిర్మాణం చేపట్టక పోతే 150 ఎకరాల భూముల రైతులము ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు.వ్యవసాయ భూముల వద్దకు వెళ్లాలంటే చందుపట్ల లేదా చివ్వెంల వద్ద నుంచి వెళ్లాలని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో రైతులు నాగయ్య, వెంకన్న, ఎల్లయ్య, వెంకన్న, చిన్నోడు, మంగయ్య, సైదులు, ఆంజనేయులు, లింగస్వామి, నాగరాజు,దుర్గయ్య, వెంకన్న, లింగస్వామి పాల్గొన్నారు.