Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ి నిరసన
నవతెలంగాణ-మిర్యాలగూడ
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను సవరించాలని మాజీ ఎమ్మెల్యే రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, సీఐటీయూ, ఐద్వా, డీవైఎఫ్ఐ, అవాజ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. స్థానిక సీపీఐ(ఎం) కార్యాలయం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న రైతాంగ, కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలన్నారు. రైతులకు, కార్మికులకు బడ్జెట్లో సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని మండిపడ్డారు. కనీస మద్దతు ధర అందేలా చట్టం చేయాలని, వ్యవసాయానికి, విద్య వైద్యానికి నిధులు పెంచాలని కోరారు. పెంచిన ఎరువులు పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించి వాటిపై ఇచ్చే సబ్సిడీలను పెంచాలని కోరారు. పట్టణ ప్రాంతాల్లో ఉపాధి హామీ అమలు చేసి పనులు కల్పించాలని కోరారు. ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని, అప్పటివరకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ సంస్థలను కార్పొరేట్ శక్తుల అప్పగించడం వల్ల పేద ప్రజలపై భారాలు పడుతున్నాయని వాపోయారు. ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు ప్రజలు చైతన్యవంతులు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర నాయకులు డబ్బీకార్ మల్లేష్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రవి నాయక్, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు పోలే బోయిన వరలక్ష్మి, సీఐటీయూ జిల్లా నాయకులు డాక్టర్ మల్లు గౌతమ్ రెడ్డి, కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సీతారాములు, జిల్లా నాయకులు రాగి రెడ్డి మంగారెడ్డి, బావాండ్ల పాండు, అవాజ్ జిల్లా అధ్యక్షులు ఎండీ.అంజద్, ఆయుబ్, తిరుపతి రామ్మూర్తి, పగిడోజు రామ్మూర్తి, నంద్యాల కృపాకర్ రెడ్డి, కోటిరెడ్డి, సైదులు పాల్గొన్నారు.
కేంద్రబడ్జెట్లో బడా సంపన్నులకు పెద్దపీట
సూర్యాపేటలో ప్రజా సంఘాల నిరసన
సూర్యాపేట :కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కార్పొరేట్ శక్తులకు పెద్దపీట వేసిందని సీఐటీయూ జిల్లా అధ్యక్షకార్యదర్శులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు,తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు విమర్శించారు.శుక్రవారం జిల్లాకేంద్రంలోని నల్లాలబావిసెంటర్లో కేంద్రబడ్జెట్‌ను వ్యతిరేకిస్తూ తెలంగాణ వ్యవసాయకార్మిక సంఘం, తెలంగాణ రైతుసంఘం, సీఐటీయూ, కేవీపీఎస్, పీఎన్ఎం, జీ ఎంపీఎస్, ఐద్వా, కేజీకేఎస్ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన బడ్జెట్ రైతాంగానికి,ఉపాధికూలీలకు, పేద,సామాన్య,మధ్య తరగతి ప్రజలకు తీవ్ర నిరాశ కలిగించే విధంగా ఉందన్నారు.నిర్మలాసీతారామన్ ప్రవేశపెట్టిన రూ.39.45 లక్షల కోట్ల బడ్జెట్ కార్పొరేట్ అధిపతులకు అనేక రాయితీలిచ్చిందని విమర్శించారు.నిరుపేదలకు, రైతులకు ఇచ్చే సబ్సిడీలను ఎత్తి వేసిందని విమర్శించారు.కార్పొరేట్ల పన్నుల రాయితీ 12 శాతం నుండి 7 శాతానికి తగ్గించారన్నారు.ప్రయివేట్పరిశ్రమల పన్నుల రాయితీలు 18 శాతం నుండి 15 శాతానికి తగ్గించారన్నారు.నిరుపేదల ఆహార సబ్సిడీని,రైతుల ఎరువుల సబ్సిడీలను ఎత్తివేశారన్నారు.గతబడ్జెట్‌లో రూ 2.86 వేల కోట్లు ఉన్న ప్రజా పంపిణీ కేటాయింపులు రూ.2.06 వేల కోట్లకు తగ్గించారన్నారు.కనీసవేతనాల చెల్లింపు కోసం బడ్జెట్లో అధిక నిధుల పెంపునకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.కార్మిక హక్కులను హరించే కార్మికకోడ్లను, విద్యుత్‌చార్జీల పెంపు సవరణచట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రైతుసంఘం జిల్లా నాయకురాలు కొప్పులరజిత,కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి కోటగోపి, కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎల్గూరి గోవింద్, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి వేల్పుల వెంకన్న,ఐద్వా జిల్లా కార్యదర్శి మేకనబోయిన సైదమ్మ, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ చెరుకు యాకలక్ష్మీ, జీఎంపీఎస్ జిల్లా కార్యదర్శి వీరబోయినరవి, ప్రజాసంఘాల నాయకులు మేకనబోయిన శేఖర్, చినపంగ నర్సయ్య, కొండేటి ఉపేందర్, గట్టిపల్లిసత్తిరెడ్డి పాల్గొన్నారు.
నల్లగొండ : కేంద్ర ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ కాకులను కొట్టి గద్దలకు వేసినట్టుగా దేశ సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టే విధంగా ఉందని దీనిని వెంటనే సవరించి సంక్షేమానికి పెద్దపీట వేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు చిన్నపాక లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ప్రజా వ్యతిరేక బడ్జెట్ ను నిరసిస్తూ శుక్రవారం కనగల్ మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ తో ఉపాధి కోల్పోయి ఆదాయాలకు గండి పడి, పెరుగుతున్న పేదరికం నిత్యావసర వస్తువుల ధరలతో దేశ ప్రజలు నలిగిపోతుంటే గతం కంటే ఐదు లక్షల కోట్లు ఎక్కువ బడ్జెట్ పెట్టి పేదలను, రైతులను, కార్మికులను ఏ మాత్రం పట్టించుకోలేదని, కార్పొరేట్లకు మాత్రం ఉదారంగా రాయితీలు ఇచ్చిందని ఆరోపించారు. కార్మిక వర్గానికి కనీస వేతనాలు, కనీస మద్దతు ధర చట్టం, వ్యవసాయ కార్మికులకు ఉపాధి హామీ పని దినాలు 200 రోజులకు పెంచాలని, 600 రూపాయల కూలి ఇవ్వాలని పట్టణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం విస్తరించడం వంటి అంశాల గురించి ఈ బడ్జెట్లో పట్టించుకోకపోవడం అన్యాయమని అన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు కందుల సైదులు, సీఐటీయూ మండల కన్వీనర్ కానుగ లింగస్వామి, నాయకులు బురకల నరసింహ్మ, ముద్దం లింగయ్య, నాగయ్య, ఈదయ్య, పగిడిమర్రి శంకర్, గాజుల జ్యోతి, కొప్పోలు శంకర్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
కేంద్రబడ్జెట్లో సవరణలు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో అన్ని రంగాలను విస్మరించిందని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి ఆరోపించారు. శుక్రవారం సీఐటీయూ, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల జాతీయ కమిటీ పిలుపుమేరకు నల్లగొండ పట్టణంలో సుభాష్ విగ్రహం దగ్గర నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వీరారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్మిక ప్రజావ్యతిరేక విధానంగా ఉందని చెప్పారు. వ్యవసాయం, విద్య , వైద్య రంగాలకు బడ్జెట్ పెంచాలని డిమాండ్ చేశారు. బ్యాంకులకు కార్పొరేట్ కంపెనీలు కట్టాల్సిన అప్పులు వెంటనే రికవరీ చేయాలని, పెట్రోల్ డీజిల్ పై పెంచిన పన్నును తగ్గించాలని కోరారు. పేదల సంక్షేమానికి నిధులు పెంచాలని కోరారు. జాతీయ ఆస్తుల నగదీకరణ అపాలని డిమాండ్ చేశారు. ఎరువులు , వంట గ్యాస్ సబ్సిడీ పెంచాలని కోరారు. ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచి వ్యవసాయ కార్మికులను ఆదుకోవాలన్నారు. అంగన్వాడీల భద్రత కోసం బడ్జెట్లో నిధులు పెంచాలని కోరారు. మధ్యాహ్న భోజన పథకానికి అత్యధిక నిధులు కేటాయించాలని, ప్రస్తుత బడ్జెట్ సంపన్నులకు రాయితీలు, పేదలకు భారాలు వేసే విధంగా ఉన్నదని ఆరోపించారు. బడ్జెట్‌ను వెంటనే సవరించి ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ, పేద మధ్యతరగతి ప్రజల సంక్షేమానికి నిధులు పెంచే విధంగా సవరణలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు కుంభం కృష్ణారెడ్డి, రైతు సంఘం (సీఐటీయూ) జిల్లా ఉపాధ్యక్షులు ఎండి.సలీం, జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, రైతు వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు (సీఐటీయూ) గంజి నాగరాజు, నకిరేకంటి సుందరయ్య, పిన్నపరెడ్డి మధుసూదన్ రెడ్డి, గనిపెళ్లి రాములు, పల్లె నగేష్, గడ్డం రాములు, కత్తుల ముత్తయ్య, సుంకరబోయిన వెంకన్న, విష్ణుమూర్తి, సందీప్, మహేష్ పాల్గొన్నారు.
చిట్యాల :కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కార్మిక, ప్రజా వ్యతిరేక బడ్జెట్ ను సవరించాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారీ అయిలయ్య డిమాండ్ చేశారు. చిట్యాల పట్టణంలో శుక్రవారం రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేసి, ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిóగా పాల్గొన్న అయిలయ్య మాట్లాడుతూ వ్యవసాయం, విద్య, వైద్య రంగాలకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులు పెంచాలని కోరారు. పెట్రోల్, డీజిల్ పై పెంచిన పన్నులు తగ్గించి ఎరువులు, వంట గ్యాస్ పై సబ్సిడీ పెంచి పేదప్రజల సంక్షేమానికి నిధులు పెంచాలని, లేనియెడల ఆందోళనలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర నాయకులు ఐతరాజు నర్సింహ, వివిధ ప్రజా సంఘాల నాయకులు జిట్ట నగేష్, అరూరి శ్రీను, పామనుగుళ్ళ అచ్చాలు, జిట్ట సరోజ, రుద్రారపు పెద్దులు, లడే రాములు, గుడిసె లక్ష్మీ నారాయణ, గునగంటి క్రిష్ణయ్య, జిట్ట స్వామి, ఈసం రాజు పాల్గొన్నారు.
ఉపాధి హామీ పనులు వెంటనే ప్రారంభించాలి
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన మున్సిపాలిటీ పరిధిలోని కూలీలకు ఉపాధి హామీ పథకం పనులు కల్పించి కార్మికులను ఆదుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారీ అయిలయ్య డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం, వివిధ ప్రజా సంఘాల నాయకులతో కలిసి ఆయన చిట్యాల మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని శుక్రవారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అయిలయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి బడ్జెట్ కేటాయింపులు పెంచి వ్యవసాయ కార్మికులను అన్ని రకాలుగా ఆదుకోవాలని కోరారు. నిత్యావసర వస్తువుల ధరలను దృష్టిలో పెట్టుకొని ప్రతి కూలీకి రోజు ఆరు వందల రూపాయలు దినసరి కూలి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. వలస కూలీలను ఆదుకునేందుకు మున్సిపల్ పరిధిలోని గ్రామాల్లో ఉపాధి హామీ పనులు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. అనంతరం స్థానిక మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా నాయకులు జిట్ట నగేష్, అరూరి శ్రీను, ఐతరాజు నర్సింహ, రుద్రారపు పెద్దులు, లడే రాములు, వైస్ ఛైర్మన్ కూరెళ్ళ లింగస్వామి, జిట్ట బొందయ్య, కోనేటి క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.