Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-డిండి
విద్యారంగం పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్‌నాయక్ అన్నారు. శుక్రవారం డిండి మండల కేంద్రంలోని ఒకేషనల్ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎస్ఎఫ్ఐ మండల కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అథితులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నాయని, అందుకు వ్యతిరేకముగా సమరశీల పోరాటాలు నిర్వహించేందుకు సిద్ధం కావాలని కోరారు. మధ్యాహ్న భోజనంలో కోత విధానం సరైందికాదన్నారు. కేంద్రంలో ఉన్న బిజేపి ప్రభుత్వం హిజాబ్ పేరుతో రాష్ట్రంలోని విద్యాలయాలలో విద్యార్థుల మధ్య వైషమ్యాలు పెంచిపోషింస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. జూనియర్, డిగ్రీ కళాశాలలో మధ్యాహ్న భోజనం అమలును తుంగలోతొక్కిందన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ దేవరకొండ డివిజన్ ఉపాధ్యక్షులు నేనావత్ బాబూలాల్, మూడావత్ శ్యామ్, గోపిక, పూజ, నిఖిత, అఖిల్, రాజేష్ పాల్గొన్నారు.