Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చివ్వెంల
మండలంలోని ఐలాపురంలో పంచాయతీకార్యదర్శిగా పని చేస్తున్న సోమకిరణ్కుమార్ బదిలీపై వెళ్తుండడంతో శుక్రవారం సర్పంచ్ బోడపల్లి సునీత శ్రీను, పాలకవర్గ సభ్యులు వీడ్కోలు కార్యక్రమం నిర్వహి ంచారు.అనంతరం ఆయన్ను ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా సర్పంచ్ సునీత మాట్లాడుతూ కిరణ్‌కుమార్ గ్రామానికి ఏడేండ్లుగా సేవలందించి బదిలీపై వెళ్లడం బాధ కలిగించిందన్నారు.ఎంపీఓ గోపి మాట్లాడుతూ ఉద్యోగజీవితంలో బదిలీలు సర్వసాధారణమన్నారు. నూతన పంచాయతీకార్యదర్శిగా నిమ్మ శ్రీకాంత్ విధులలో చేయడంతో వారిని కూడా సన్మానించి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ధరావత్ బుచ్చమ్మ, ఉపసర్పంచ్ వినోద్‌కుమార్ , వార్డుసభ్యులు చిక్కుల నాగేంద్రబాబు, కోట సుప్రజ, ధరావత్లక్ష్మీ, అంగోతు సునీత, ముడుపు సత్తిరెడ్డి, అరిగె గాయత్రి, అరిగె నాగరాజు, కోట వనజ, ధరావత్ నర్సింహ, కోఆప్షన్ సభ్యులు,గ్రామ అధికారులు,అనధికారులు తోటి పంచాయతీ కార్యదర్శులు, గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామపెద్దలు బోడపట్ల శ్రీను, పరుశరాములు, మోహన్‌రెడ్డి, తిరుమలాచారి, సాల్మన్‌రాజు, ప్రవీణ్, శ్రీకాంత్, కష్ణ, వినోద్, కిషన్, శ్రవణ్, వెంకటాచారి, సైదులు, కిరణ్ పాల్గొన్నారు.