Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
విద్యాభివద్ధికి దివీస్ పరిశ్రమ అందిస్తున్న కషి ఎంతో అభినందనీయమని లింగారెడ్డిగూడెం ప్రాథమిక పాఠశాల ఎస్ఎంసీ చైర్మెన్ ఊదరి అచ్చయ్య తెలిపారు. శుక్రవారం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో దివీస్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం, విద్యార్థులకు నోట్‌బుక్స్, బ్యాగులు, హార్లిక్స్ ప్యాకెట్స్, 50 ఎల్‌పీహెచ్ ఆర్ఓ ప్లాంటును అందజేశారు. మూడు లక్షల 67వేల 603 రూపాయల విలువ గల వస్తువులు పంపిణీచేయడం ఎంతో సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కంచి ఉమ, డాక్టర్ అశ్విన్, ఉపాధ్యాయులు నాగేశ్, దివీస్ అధికారి వల్లూరి వెంకటరాజు, వెంకటేశ్వర్లు, అంగన్వాడీ టీచర్ ఉష్కాగుల జయ పాల్గొన్నారు.