Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరుటౌన్
మండల కేంద్రంలో శుక్రవారం సీఎంరిలీఫ్ ఫండ్ చెక్కులను శుక్రవారం మున్సిపల్ చైర్మెన్ వస్పరి శంకరయ్య, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేశం లబ్దిదారులకు అందజేశారు. ఎస్.శ్రీనివాస్ 17.500, ఎం .లలిత కు రూ. 49.000, కె.అబ్బాసాయిలు రూ.57.500, డి.నవీన్ 60.000, మోరిగాడి సుగుణమ్మ రూ.60.000, భోగ మాధవిరూ.19.000, కె చంద్ రూ. 24వేల విలువగల చెక్కులను పంపిణీచేశారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ బేతి రాములు, నాయకులు మొరిగాడి వెంకటేష్, దాసి సంతోష్ , సీసా సత్తయ్య , ఎమ్మే కల్యాణ్ ,కటకం బాలరాజు ,ఫయాజ్, పులిపలుపుల బాలమణి పాల్గొన్నారు .