Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్రెడ్డి
నవతెలంగాణ- రాజాపేట
పల్లెప్రగతే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతమహేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని పారుపల్లి, రఘునాథపురం, దూది వెంకటాపురం, బొందుగుల, సింగారం ,కుర్రారం, జాల తదితర గ్రామాలలో పలు అభివద్ధి పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎస్డీఎఫ్ నిధుల కింద ప్రతి గ్రామానికీ రూ.25 లక్షల చొప్పున నిధులను మంజూరు చేసినట్టు తెలిపారు. రైతుల కోసం రైతు బీమా, రైతుబంధు, నాణ్యమైన 24 గంటల ఉచిత కరెంటు లాంటి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికి దక్కిందని తెలిపారు.రానున్న కాలంలో కేంద్రంలో హంగ్ పార్లమెంట్ తప్పదని,కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించబోతున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మెన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, జెడ్పీటీసీ చామకూర గోపాల్ గౌడ్ ,ఎంపీపీ గోపగాని బాలమణి ,సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కంచర్ల శ్రీనివాస్ రెడ్డి, టీిఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజిరెడ్డి ,స్థానిక సర్పంచులు విష్ణు ,ఎడ్ల స్వరూప, జూకంటి మమత ,గాడి పల్లి శ్రవణ్, ఈశ్వరమ్మ శ్రీశైలం, తదితరులు పాల్గొన్నారు.