Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ చెక్ డ్యాం పనులను పరిశీలించిన మందుల సామేల్
నవతెలంగాణ-అడ్డగూడూరు
సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని రాష్ట్ర గిడ్డంగుల మాజీ చైర్మెన్ మందుల సామేలు అన్నారు.శుక్రవారం మండలంలోని ధర్మారం గ్రామంలో నిర్మిస్తున్న చెక్‌డ్యాం పనులను ఆయన పరిశీలించి మాట్లాడారు. తనకషితో 8కోట్ల రూ.40లక్షల వ్యయంతో గతేడాది మే నెలలో గుత్తేదారులు పనులు ప్రారంబించారన్నారు. జూన్ నెలలో వాగులో నీటి ప్రవాహం రావడం తో పనులు ఆగిపోయాయని, మళ్ళీ ఇప్పుడు మళ్లీ పనులు ప్రారంభించారన్నారు. చెక్ డ్యాం నిర్మాణం పూర్తయితే ధర్మారం, లక్ష్మీదేవికాల్వ, వర్దమానుకోట, మాచిరెడ్డిపల్లి గ్రామాల్లో సుమారు2వేల ఎకరాల కు రెండు పంటలకు సాగునీరు పుష్కలంగా దొరుకు తాయన్నారు. తుంగతూర్తి నియోజకవర్గ పరిధిలో కాలేశ్వరం జలాలు అందుతున్నాయి వాటి ప్రభావం తో బిక్కేరు వాగులో నీటిప్రవాహం సకాలంలో వస్తున్నందున రైతులు సంతోషంగా ఉన్నారని తెలిపారు. ర్తెతులకు ఇబ్బందులు లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేసారని కొని యాడారు. ప్రాజెక్టుల పేరుతో అనుమతులు పొంది ఇసుకను అక్రమంగా రవాణాచేస్తూ హైదరాబాద్‌కు తరలిస్తున్నారని ఆరోపించారు. ర్తెతుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చూస్తుంటే కొందరు అనుమతులు పేరుతో అక్రమంగా ఇసుకను తరలిస్తూ వాగులను లూటీ చేస్తున్నారన్నారు. దీనివల్ల భవిష్యత్తులో సాగు, తాగునీటికి ఇబ్బందులు ఏర్పడతాయన్నారు. అధికారులు చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇసుక తరలింపును అడ్డుకున్న వారిప్తె అక్రమకేసులు పెట్టి వేదించి భయాబ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. తక్షణమే కేసులు ఉపసంహరించాలని, ఇసుక అనుమతులు రద్దుచేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ర్తెతులతో సంతకాల సేకరణ చేసి సీఎం కేసీఆర్‌కు నివేదిక అందజేస్తానని తెలిపారు.