Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘాల డిమాండ్
నవతెలంగాణ - భువనగిరి
కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా తీసుకొచ్చిన బడ్జెట్ను సవరించాలని, ప్రజాసంక్షేమం కోసం అధిక నిధులు కేటాయించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ, సీఐటీయూజిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి పాండు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ను సవరించాలని డిమాండ్ చేస్తూ ఆయా సంఘాల ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 39.45 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ కేవలం కార్పొరేట్ శక్తులకు అనేక రాయితీలు ఇచ్చి, సామాన్య ప్రజలకు మాత్రం భారాలు మోపిందని విమర్శించారు. నిరుపేదలకు ,రైతాంగంకు ఇచ్చే సబ్సిడీలను ఎత్తి వేసి కార్పొరేట్లకు పన్నుల రాయితీ 12 శాతం నుండి 7 శాతం,ప్రయివేట్ పరిశ్రమలకు పన్నుల రాయితీలు 18శాతం నుండి 15 శాతంకు తగ్గించారని విమర్శించారు. నిరుపేదల ఆహార సబ్సీడీని , రైతుల ఎరువుల సబ్సిడీలను మాత్రం భారీగా కోత విధించాలని విమర్శించారు. గత బడ్జెట్లో రూ.2.86 వేల కోట్లు ఉన్న ప్రజా పంపిణీ కేటాయింపులు రూ.2.06 వేల కోట్లకు తగ్గించారని,ఎరువుల సబ్సీడీలను రూ 4, 380 కోట్లకు కోత విధించడం దుర్మార్గపు చర్యన్నారు. గిట్టుబాటు ధరలు చట్టం, చనిపోయిన రైతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియో ఇస్తామన్న మాటలేదన్నారు.ఉపాధిహామీ పనులకు గత బడ్జెట్ లో రూ. 98 వేల కోట్లు కేటాయించిన మోడీ ఈసారి రూ. 73 వేల కోట్లు కేటాయింపు చేసి చట్టాన్ని నిర్వీర్యం చేయాలనే కుట్ర చేస్తున్నారని విమర్శించారు. కార్మిక హక్కులను హరించే కార్మిక కోడ్ లను, విద్యుత్ చార్జీల పెంపు సవరణ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వనం రాజు, గిరిజన సంఘం జిల్లా కన్వీనర్ రమేష్ నాయక్, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు మాయా కష్ణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు కొండాపురం యాదగిరి నాయకులు పర్వతం బాలకష్ణ, దయ్యాల మల్లేష్, వనం గిరి, కార్తీక్, సాయి పాల్గొన్నారు.