Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
ల్యాండ్ పూలింగ్ స్కీం కింద ప్రధాన రహదారులు వెంబడి వెంచర్ల ఏర్పాటు పై శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో లావని పట్టాదారులతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మాట్లాడుతూ ప్రభుత్వం, రైతుల పరస్పర భాగస్వామ్యంతో కొత్తపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో వెంచర్ చేయడానికి కలెక్టర్ వివరించారు. ల్యాండ్ పూలింగ్ చేయడానికి కనీసం 50 ఎకరాల భూమి ఉండాలన్నారు. అందుకోసం భూమి పట్టాదారులు, రైతులు ముందుకు వచ్చినట్లైతే ప్రభుత్వమే అన్ని ఖర్చులతో అభివృద్ధి చేస్తామన్నారు. ప్రభుత్వం చేసే లే అవుట్లలో రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ సౌకర్యం, వాటర్ ట్యాంక్స్, మైదానాలు, పార్కులు మొదలగు అన్నిరకాల మౌలిక సౌకర్యాలను కల్పిస్తామని తెలిపారు. రోడ్డు ఫేస్ ఉన్న పట్టాదారులకు మొదటి ప్రాధాన్యత కూడా కల్పిస్తామని ఆయన తెలిపారు. లావనీ పట్టాదారులకు మాత్రం ప్రభుత్వ నిబంధనల మేరకు ఎకరానికి 600 గజాల స్థలం అందజేయనున్నట్లు ఆయన వివరించారు. అనంతరం ప్రభుత్వ వాటాగా వచ్చిన ప్లాట్లను వేలం పాట ద్వారా విక్రయించి దాని మీద వచ్చే ఆదాయంతో ఇతర అభివృద్ధి పనులు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా వారి సందేహాలని కలెక్టర్ నివృత్తి చేశారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, ఆర్.డీ.ఓ.జగదీశ్వర్ రెడ్డి, నల్లగొండ తహశీల్దార్ నాగార్జున, రైతులు, లావని పట్టాదారులు, తదితరులు పాల్గొన్నారు.