Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-డిండి
హైదరాబాద్ నుండి అచ్చంపేట వెళ్తున్న విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఎంపీ పోతుగంటి రాములుకు డిండిలో సర్పంచ్ మేకల సాయమ్మ కాశన్న ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు శుక్రవారం స్వాగతం పలికారు. అనంతరం సర్పంచ్ మేకల సాయమ్మ కాశన్న చేతుల మీదుగా వినతిపత్రం అందజేశారు. స్థానిక దొంతినేని నర్సింహారావు జూనియర్ కాలేజీ ప్రహారీ గోడ నిర్మించాలని, హైస్కూలు ప్రైమరీ స్కూలులో 14 తరగతి గదులకుపూర్తిగా 10 తరగతి గదులు శిథిలావస్థకు చేరినందున కొత్తగా నిర్మాణం చేపట్టాలని, ప్రైమరీ స్కూల్ నుంచి హైస్కూల్ మధ్యలో దాదాపు 800 మీటర్లు ప్రహారీ గోడను నిర్మించేందుకు నిధులను మంజూరు చేయాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మేకల కాశన్న, ఎంఏ.కలీం తదితరులు పాల్గొన్నారు.