Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చివ్వెంల
నాయకులు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు పారేపల్లి జానయ్య స్తూపం ఆవిష్కరణ ఆదివారం బండమీది చందుపట్ల గ్రామంలో నిర్వహించారు.పారేపల్లి జానయ్య కుమారులు పారేపల్లి సోమేశ్వరరావు, ఆవిష్కరించారు.పగిడి ఎర్రయ్య గ్రామీణ పేదల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జతిన్ కుమార్, ఓపీడీఆర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జెండాను ఆవిష్కరించారు.అనంతరం వారు మాట్లాడుతూ పారేపల్లి జానయ్య విప్లవ ఆశయాలను కొనసాగిస్తామని విప్లవ కార్యకర్తలు ప్రతినబూనారన్నారు.అనంతరం గ్రామీణ పేదల సంఘం ఉమ్మడి నల్గొండ జిల్లా 5వ మహాసభను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో జానయ్య సతీమణి పారేపల్లి అనసూయమ్మ, పగిడి ఎర్రయ్య గ్రామీణ పేదల సంఘం రాష్ట్ర అధ్యక్షులు, ఓపీడీఆర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ జతిన్ కుమార్,కొనకంచి వీర భద్రయ్య, ఓపీడీఆర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి విజేందర్, కన్నెబోయిన వెంకటాద్రి ,గ్రామీణ పేదల సంఘం రాష్ట్ర కార్యదర్శి పోలేబోయిన ముత్తయ్య, పేదల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి సుంకరి రమేష్‌బాబు, ఎంపీటీసీ కోడి బండ్లయ్య, నాయకులు తండు మల్సూర్, నల్లగొండ వెంకన్న పాల్గొన్నారు.