Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అపేదలకు ఏ ఆపద వచ్చినా ఆదుకునే గుణం ఆయనది
నవతెలంగాణ-చివ్వెంల
స్వశక్తితో వ్యాపారరంగంలో ఉన్నత స్థానానికి ఎదిగి.. ఆపై రాజకీయాల్లో చురుకైన యువ నేతగా గుర్తింపు పొందారు.ప్రజలకు స్వయంగా సేవ చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లో అడుగుపెట్టారు. ప్రజలకు నేరుగా సేవ చేయాలనే లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చిన జూలకంటి జీవన్‌రెడ్డి కాంగ్రెస్ లో పనిచేసి సీఎం కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలు అభివద్ధి కార్యక్రమాలకు ఆకర్షితుడై సూర్యాపేట శాసనసభ్యులు తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రివర్యులు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్లో చేరారు.నాటి నుంచి మండలంలో అన్ని సామాజిక వర్గాల ప్రజలను కలుపుకొని పోతూ అనతికాలంలోనే వల్లభాపురం ఎంపీటీసీగా ఎన్నికై వైస్‌ఎంపీపీగా నియమితులయ్యారు.మంత్రి అండగా ఉంటూ పార్టీ నిర్దేశించిన కార్యక్రమాలు విజయ వంతమయ్యేలా తన వంతు కషి చేస్తున్నారు.పార్టీకి తాను చేస్తున్న సేవలను గుర్తించి మంత్రి ఆయన్ను మండలఅధ్యక్షునిగా నియమించారు.
కష్టాల్లో ఉన్నవారికి పెద్దన్నగా
మండలంలో పేద ప్రజలను ఆపదలో ఆదుకునే గొప్ప మనసున్న నేతగా జీవన్‌రెడ్డి గుర్తింపు పొందారు.ఆపదలో ఉన్నారని తెలిసిన వెంటనే వారికి నేనున్నానంటూ ఆర్థిక సహాయం అందజేసి తోడుగా నిలుస్తున్నారు. మండలంలోని వివిధ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ఉన్నతాధికారుల దష్టికి తీసుకెళ్తూ తనదైన శైలిలో పరిష్కారానికి ఎల్లవేళల కషి చేస్తున్నారు.
ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం....(జూలకంటి జీవన్ రెడ్డి
వైస్ ఎంపీపీ, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు
ప్రజలకు నేరుగా సేవ చేయాలనే లక్ష్యంతోనే రాజకీయాల్లోకి వచ్చా. ప్రజా సమస్యల పరిష్కారానికి కషి చేస్తూ పేద మధ్యతరగతి ప్రజలకు ఏ ఆపద వచ్చినా అండగా ఉంటూ మంత్రి జగదీశ్‌రెడ్డి సహకారంతో మండలంలో అభివద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తూ టీఆర్ఎస్లో మండలంలో బలోపేతం చేస్తా.