Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రామన్నపేట
మండలంలోని మునిపంపుల గ్రామంలో సీనియర్ టైలర్ మహమ్మద్ ఖాదర్ మతి చెందడంతో ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ టైలర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం రూ.5 వేల ఆర్థికసాయాన్ని అసోసియేషన్ మండలాధ్యక్షులు సంగిశెట్టి వేణుగోపాల్ అందజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఎండి నజీర్, షేక్ షబ్బీర్, అలీబాబా, మునిపంపుల ఎంపీటీసీ గాదె పారిజాత ముకుంద, మాదాసు నర్సింహ, పిట్టల శ్రీను, చెరుకుసాయికుమార్, ఏలూరు రవి, లవణం లక్ష్మయ్య, గాదెరాములు,యాకుబ్, రమేశ్, ఉపేందర్ పాల్గొన్నారు.