Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
బహుజన యుద్ధవీరుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ స్ఫూర్తితో గౌడ కులస్తులు తమ హక్కుల సాధనకు ఐక్యంగా ఉద్యమించాలని జైగౌడ సంక్షేమసంఘం వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు బూర మల్సూర్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బొమ్మగాని శ్రీనివాస్‌గౌడ్, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పంతంగి వీరస్వామిగౌడ్ కోరారు.ఆదివారం జిల్లా కేంద్రంలోని శ్రీ లక్ష్మీగార్డెన్స్‌లో జరిగిన జై గౌడ సంక్షేమసంఘం ఆవిర్భావ కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సుదీర్ఘచర్చల అనంతరం కమిటీని ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు మీడియాతో మాట్లాడారు.పోరాటాల పురిటిగడ్డ అయిన సూర్యాపేట జిల్లాకేంద్రంలో ఏర్పాటైన జై గౌడ సంక్షేమసంఘం రెండు తెలుగు రాష్ట్రాలలో నిర్మాణం చేయనున్నట్టు తెలిపారు.బహుజన యుద్ధవీరుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ పోరాట పటిమ, తెలంగాణ సాయుధ పోరాటయోధుడు బొమ్మగాని ధర్మభిక్షం స్ఫూర్తితో గౌడ కులస్తుల హక్కుల సాధనకు జై గౌడ సంక్షేమసంఘం పోరాడుతుందని చెప్పారు.గతంలో తాము పనిచేసిన జై గౌడ ఉద్యమం సంఘం రాజకీయ పార్టీగా అవతరించడంతో తాము రాజకీయాలకతీతంగా గౌడ కులస్తుల హక్కులకోసం మాత్రమే పోరాడేలా జై గౌడ సంక్షేమ సంఘం ఏర్పాటు జరిగిందని అభిప్రాయపడ్డారు.త్వరలోనే రెండు తెలుగు రాష్ట్రాలలో గౌడ కులస్తులను ఐక్యం చేస్తూ కమిటీలను ఏర్పాటు చేస్తామని చెప్పుకొచ్చారు. తాటి చెట్టు పైనుండి పడి మరణించిన గీత కార్మికుల కుటుంబాలను గుర్తించి ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు చౌగగోని సతీష్‌గౌడ్, నాయకులు గోపగాని గిరిగౌడ్, గుణగంటి సైదులుగౌడ్, కోటగిరి చంద్రశేఖర్‌గౌడ్, ఎల్గూరి రమాకిరణ్‌గౌడ్, చికూరి కష్ణ గౌడ్, ఉయ్యాల నర్సయ్యగౌడ్, కట్ట దయాకర్‌గౌడ్,కొప్పు లక్ష్మీనారాయణగౌడ్, రాపర్తి కేశవులుగౌడ్, శిగ సురేష్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.