Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆలేరుటౌన్
ఉక్రెయిన్ రష్యా మిలిటరీ దాడుల వల్ల తెలంగాణ రాష్ట్రం నుండి వైద్య విద్య అభ్యసించేందుకు వెళ్లిన విద్యార్థులు అధైర్యపడవద్దని ఆలేరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కుడుదల నగేష్ అన్నారు.రాజపేట మండలం రఘునాథపురం గ్రామానికి చెందిన కుడుదుల యాదగిరి, యోగేశ్వరి దంపతుల కుమారుడు హరితేజ ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్ సెకండియర్ చదువుతున్నాడు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి కారణంగా తమ కుమారుడు పరిస్థితి ఏవిధంగా ఉందో అని మండలకేంద్రంలో మాజీ శాసనసభ్యులు డాక్టర్ నగేష్‌ను విద్యార్థి తల్లిదండ్రులు కలిసి తమ ఆందోళన వ్యక్తం చేశారు.ఉక్రెయిన్‌లో ఉన్న హరితేజతో డాక్టర్ కుడుదుల నాగేశ్ చరవాణిలో వీడియో కాల్ చేసి మాట్లాడి విద్యార్థికి ధైర్యం చెప్పారు.విద్యార్థి తిరిగి స్వదేశానికి వచ్చేందుకు రాష్ట్ర మంత్రి కేటీఆర్ రాష్ట్ర ఉన్నత అధికారుల దష్టికి తీసుకువెళ్లాల్సిందిగా విద్యార్థి తల్లిదండ్రులు ఆయన్ను కోరారు.ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు ఎండీ గౌస్, నాయకులు దూసరి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.