Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మద్దిరాల
మండలంలోని గుమ్మడవెళ్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు.1991-92లో పదో తరగతి చదివిన విద్యార్థులు ఒకే చోటుకు చేరుకుని 30 ఏండ్ల తర్వాత ఒకరికొకరు కలిసి యోగక్షేమాలు తెలుసుకుని గురువులను శాలువాలతో ఘనంగా సన్మానించారు.పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ తమ లాంటి ఎంతో మంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి, తీర్చిదిద్దిన గురువులను సన్మానించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ముక్కాల మురళీధర్‌రెడ్డి, రాజారాంశాస్త్రి, జగ్గయ్య, పాలవెల్లివెంకన్న, తీగల భాషయ్య, భిక్షంరెడ్డి, తలశెట్టి దామోదర్, విద్యార్థులు గోరుకంటి రఘు, మరిశెట్టి వెంకన్న, గట్టురవి, వెంకన్న, తలశెట్టి కష్ణ, ప్రభ, నర్సయ్య, శోభ, ఇందిర, నర్సింహ పాల్గొన్నారు.