Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు చెవిటి వెంకన్నయాదవ్
నవతెలంగాణ-తుంగతుర్తి
ప్రజా సమస్యలపై నిరంతరం స్పందిస్తూ, దేశ ప్రయోజనాల కోసం పరితపించే పార్టీ కాంగ్రెస్ అని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు చెవిటి వెంకన్నయాదవ్ అన్నారు. ఆదివారం మండలపరిధిలోని రావులపల్లి గ్రామంలో పార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమానికి హాజరై ప్రసంగించారు.ఈ మేరకు పార్టీ అధ్యక్ష పదవిలో చోటు చేసుకున్న మార్పు కాంగ్రెస్ గెలుపునకు సంకేతమని అన్నారు.నిరాశ నిస్పహల్లో ఉన్న పార్టీకి రేవంత్రెడ్డి ఊపిరి పోశారన్నారు.నాయకులు, కార్యకర్తల అంచనాలకు తగ్గట్టు పార్టీని బలోపేతం చేసి అధికారం వైపు తీసుకెళ్లాల్సిన బాధ్యత క్షేత్ర స్థాయి నుండి ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో తుంగతుర్తి మండల అధ్యక్షులు దొంగరి గోవర్ధన్, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు జోహార్, జిల్లా నాయకులు రేట్నేని శ్రీను,బానోత్ మాన్సింగ్నాయక్, భాస్కర్, స్వామియాదవ్, మాజీఎంపీటీసీ చింతకుంట్ల బాబు, సుధాకర్ యాదవ్, ప్రభాకర్ ,లింగన్నయాదవ్, హరీష్, చిన్ని కష్ణయాదవ్ పాల్గొన్నారు.