Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లునాగార్జునరెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
ఇటీవల జిల్లాలో జరిగిన దాన్యం కొనుగోలు అక్రమాలపై అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లు నాగార్జునరెడ్డి అన్నారు.శనివారం రాత్రి జిల్లాకేంద్రంలోని ఎంవీఎన్ భవనంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.రైతుల పండించిన ధాన్యంపై అక్రమమార్గంలో డబ్బులు సంపాందించాలకున్న అక్రమార్కులను గుర్తించి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఆత్మకూరు(ఎస్),ముక్కుడుదేవులపల్లి,గట్టికల్లు గ్రామాలఐకేపీ, పీఏసీఎస్కేంద్రాల్లో జరిగిన అవకతవకలు మరువక ముందే లింగాల,గరిడేపల్లి గ్రామాల్లోని ఐకేపీ కేంద్రాల్లో కూడా అక్రమాలకు పాల్పడడడం దారుణమన్నారు.ఇట్టి అవకతవకల్లో నిజమైన అక్రమార్కులను గుర్తించకుండా కేవలం కింది స్థాయి ఉద్యోగులపై చర్యలు తీసుకోవడం ఏంటని ప్రశ్నించారు.ఇప్పటికైనా దీనిపై ఉన్నతస్థాయి అధికారులు సమగ్ర విచారణ జరిపి అసలు దోషులను గుర్తించాలని డిమాండ్ చేశారు.అంతేకాకుండా జిల్లాలోని మరికొన్ని ధాన్యం కొనుగోలుకేంద్రాల్లో కూడా అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వస్తున్నట్టుచెప్పారు.అందుకు అధికారులు మరోసారి లోతైన విచారణ జరిపి ప్రభుత్వ ఆదాయం తప్పుదోవ పట్టకుండా నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు. రైతుసంఘం జిల్లా అధ్యక్షులు బుర్రి శ్రీరాములు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా ప్రధానకార్యదర్శి దండ వెంకట్‌రెడ్డి, మెదరమెట్ల వెంకటేశ్వర్లు, దేవరం వెంకట్‌రెడ్డి,బెల్లంకొండ సత్యనారాయణరెడ్డి, మందడి రామిరెడ్డి, దండ శ్రీనివాస్‌రెడ్డి, కొప్పుల రజిత, నారాయణపు వీరారెడ్డి,అవిరే అప్పయ్య పాల్గొన్నారు.