Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మునగాల
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో ప్రజల మౌలిక వసతుల కల్పన కోసం కృషి చేస్తున్నట్లు ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తెలిపారు. ఆదివారం కృష్ణనగర్లో పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుతో గ్రామాల రూపురేఖలే మారిపో యాయని తెలిపారు. గ్రామ స్వరాజ్ స్థాపనే సీఎం లక్ష్యమని చెప్పారు. పట్టణాలకు దీటుగా పల్లెల్లోని ప్రజలకు మౌలిక వసతులు లభిస్తున్నాయన్నారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన శివుని విగ్రహాన్ని అవిష్కరించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సుధారాణి, పుల్లారెడ్డి, గ్రామ సర్పంచ్ వీరంరెడ్డి లింగారెడి,్డ మునగాల, ఆకుపాముల, తాడువాయి పీఏసీఎస్ చైర్మన్లు కంది బండ సత్యనారాయణ, వల్లపురెడ్డి రామిరెడ్డి, తొగరు సీతారాములు, నాయకులు నల్లపాటి శ్రీనివాస్, ఎలకా వెంకటరెడ్డి, ఎల్పీ రామయ్య, బంగారు సత్య నారాయణ పాల్గొన్నారు.