Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మిర్యాలగూడ :పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతులకు హక్కు పత్రాలు ఇవ్వాలని, పండించిన పంటకు కనీస మద్దతు ధర వచ్చే విధంగా గ్యారంటీి చట్టాన్ని అమలు చేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఆదివారం అడవిదేవులపల్లి మండలం రైతు సంఘం మొదటి మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలు అమలు చేస్తూ రైతులకు అన్యాయం చేస్తున్నారని, రైతులకు కనీస మద్దతు ధర పంటకు ప్రకటించకుండా మోసం చేస్తు న్నారన్నారు.వెంటనే ప్రభుత్వాలు కనీస మద్దతు ధర గ్యారెంటీ చట్టాన్ని అమలు చేయకుంటే రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులను ఏకం చేసి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామన్నారు. అనంతరం మండల కమిటీని ఎన్నుకున్నారు. రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు మల్లారెడ్డి, బొడ్డు బాల సైదులు, జటంగి సైదులు, ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యుడు కుర్ర సైదానాయక్, శివ నాయక్, రాంబాబు, మండల సైదులు, కొండలు, రంగా, హనుమంతు పాల్గొన్నారు.