Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హుజూర్నగర్టౌన్
జాతీయ గ్రామీణ ఉపాధిహామీ చట్టంలో క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ ఆదివారం స్థానిక ఎమ్మెల్యే సైదిరెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పోసనబోయిన హుస్సేన్ మాట్లాడుతూ గత 14 సంవత్సరాలుగా ఉపాధి హామీ పథకంలో భాగంగా ప్రజలకు సేవ చేసిన ఫీల్డ్ అసిస్టెంట్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయస్థాయిలో అవార్డు తీసుకొచ్చిన ఫీల్డ్ అసిస్టెంట్ల పనితీరును గుర్తించాలన్నారు . ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డ్, హరితహారం, మరుగుదొడ్ల నిర్మాణం, ఇంకుడు గుంతల నిర్మాణం వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ 4779 వల్ల ఫీల్డ్ అసిస్టెంట్ల మనుగడ ప్రమాదంలో పడిందని పేర్కొన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ లను ఉద్యోగం నుండి తొలగించిన రెండు సంవత్సరాలుగా ఎంతో ఇబ్బంది పడుతున్నారని న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం హుజూర్నగర్ నియోజకవర్గ ఇంచార్జి బాల సైదులు, రవిబాబు, వెంకన్న, శైలజ, వెంకట్ రెడ్డి, బాలునాయక్, నాగయ్య, సుధాకర్, వెంకన్న , బోయి శీను, అరుంధతి, నాగలక్ష్మి, చంద్రకళ, వెంకట్, లక్ష్మి, అనిత పాల్గొన్నారు.