Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మోత్కూరు
కుమ్మరులకు రాజకీయ పార్టీలు సీట్లు కేటాయించి చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించాలని తెలంగాణ కుమ్మరి సంఘం తుంగతుర్తి నియోజకవర్గ కన్వీనర్ చేతరాశి కష్ణ డిమాండ్ చేశారు.ఆదివారం మోత్కూర్లో కుమ్మరి సంఘం నాయకులతో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. కుమ్మరులు కేవలం ఓటర్లుగా కాకుండా చట్టసభల్లోకి వెళితే తగిన న్యాయం జరిజి అభివద్ధి చెందుతారన్నారు. నేటికీ వత్తినే నమ్ముకుని జీవిస్తున్న కుమ్మరి కుటుంబాలకు దళితబంధు పథకంలా కుమ్మరి బంధు అమలు చేయాలని కోరారు. అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కుమ్మరుల అభివద్ధికి బడ్జెట్లో అధిక నిధులు కేటాయించాలని, యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తగిన ప్రాధాన్యతనివ్వాలని కోరారు.తొలి ఎంబీసీ చైర్మెన్ తాడూరి శ్రీనివాస్, కుమ్మరి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాలకష్ణ, ప్రధాన కార్యదర్శి పావనిల నాయకత్వంలో పోరాడుతున్నామని తెలిపారు. ఈ సందర్భంగా తొలిసారి మోత్కూర్ వచ్చిన నియోజకవర్గ కన్వీనర్ కష్ణను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో నాయకులు చేతరాశి అంజయ్య, నిలిగొండ అంజయ్య, రాధారపు మల్లేశం, ఎన్. మహేష్, రమేశ్, ఎన్.లక్ష్మణ్, సీహెచ్.నర్సింహ, నవీన్, లింగస్వామి, హరికష్ణ, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.