Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ
పుట్టిన దగ్గర నుండి ఐదేళ్లలోపు చిన్నారులకు విధిగా పోలియో చుక్కలు వేయించాలని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సూచించారు. పల్స్ పోలియో సందర్భంగా ఆదివారం జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల, ఆస్పత్రిలో ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేసి మాట్లాడారు. పోలియో రహిత దేశం కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయ సహకారాలందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించడం తల్లిదండ్రుల బాధ్యతని తెలిపారు.అనంతరం అంగన్వాడీ కార్యకర్తలు , ఏఎన్ఎంలు, ఆశ వర్కర్‌తో మాట్లాడి పోలియో వ్యాక్సినేషన్లో ప్రభుత్వం సూచించిన జాగ్రత్తలు పాటించాలని ఆదేశించారు. గతంలో ఫ్లోరైడ్ నీటితో అంగ వైకల్యం చెందిన దుర్భరమైన జీవితాలు అనుభవించారని, కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచినీరు అందించి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్ది రాష్ట్రంలోనే కాదు దేశ ప్రజల కీర్తి నందుకు న్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌వో కొండలరావు, హాస్పి టల్ సూపరిండెంట్ లచ్చూనాయక్, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్, డీసీసీబీ డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ డాక్టర్ పుల్లారావు, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పిల్లి రామరాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
మిర్యాలగూడ : పోలియోరహిత సమాజాన్ని నిర్మించాలని ఎమ్మెల్యే భాస్కరరావు అన్నారు. ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని ప్రకాష్‌నగర్ బంగారుగడ్డ సెంటర్లో పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని, దీనికి అందరూ బాధ్యత వహిచాలని కోరారు. పల్స్ పోలియో వ్యాధి నిరోధక టీకాల వేయడం వల్ల భవిష్యత్తులో పిల్లలకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని చెప్పారు . మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తారని అన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ కేసా రవి, మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, మాజీ మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ తిరునగరు నాగలక్ష్మి, వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, సర్పంచ్ బోగవెల్లి వెంకటరమణ చౌదరి(బాబ్జి) పాల్గొన్నారు.
దేవరకొండ :చిన్నారులకు పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దామని టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం పట్టణంలోని స్పోర్ట్స్ అసోసియేషన్ భవనంలో పోలియో చుక్కలు వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలియో చుక్కలు వేయడంలో నిర్లక్ష్యం చేయవద్దని ఆయన కోరారు. కరోనా పోలియో వ్యాక్సినేషన్లో తెలంగాణ అగ్రభాగాన ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నరసింహ, రైతుబంధు అధ్యక్షుడు సిరందాసు కృష్ణయ్య, వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాష్ గౌడ్, పార్టీ నాయకులు హనుమంతు వెంకటేష్ గౌడ్, స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్వీటీ, కృష్ణకుమారి, కౌన్సిలర్ ఎం.జయప్రకాష్, నారాయణ, కృష్ణ కిషోర్, అశోక్, రమేష్, జగన్, పంతు లాల్, బొడ్డుపెళ్లి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
కోదాడ :పోలియో నిర్మూలన సామాజిక బాధ్యత అని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. ఆదివారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో పలు పోలియో సెంటర్లో పోలియో చుక్కల కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలియో మహమ్మారిని అంతమొందించేందుకు ప్రభుత్వం ఆరోగ్య శాఖ ద్వారా ఈ మహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. పిల్లల నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు ఎంతో కీలకమన్నారు. పోలి యోను శాశ్వతంగా నిర్మూలించి ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిస్తామన్నారు. పోలియో చుక్కలు వేయడానికి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రత్యేక కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. తల్లిదండ్రులు నిర్లక్ష్యం వహించకుండా కేంద్రాల వద్దకు పిల్లల్ని తీసుకెళ్లి పోలియో చుక్కలు వేయించాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ కిషోర్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర సుధారాణి పుల్లారెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షుడు చందు నాగేశ్వరరావు, వైస్ చైర్మన్ ఉపేందర్ గౌడ్, కౌన్సిలర్లు మైసా రమేష్, సుశీల రాజు, బెజవాడ శిరీష శ్రవణ్, పెండెం వెంకటేశ్వర్లు, శ్రీనివాస్ యాదవ్, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ నిరంజన్, జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, వైద్య అధికారులు షహనాజి, డాక్టర్ శైలజ, యూనియన్ నాయకులు మధు బాబు, తదితరులు పాల్గొన్నారు.