Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ వైద్యాధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలి
అ సూర్యాపేట కలెక్టర్ వినరుకృష్ణారెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
పోలియోరహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యతని కలెక్టర్ టి.వినరుకష్ణారెడ్డి అన్నారు.ఆదివారం జిల్లాకేంద్రంలోని స్థానిక ప్రభుత్వజనరల్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన పల్స్‌పోలియో కార్యక్రమాన్ని ఆయన అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్కేశవ్తో కలిసి ప్రారంభించి చిన్నారులకు పోలియోచుక్కలేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిండు జీవితానికి రెండు చుక్కలని,జిల్లాలో 0-5 ఏండ్లలోపు 93,774 మంది చిన్నారులకు మూడు రోజుల పల్స్ పోలియో కార్యక్రమంలో పోలియో చుక్కలు తప్పక వేస్తామన్నారు.జిల్లాలో ఏర్పాటు చేసిన 774 కేంద్రాలలో చిన్నారుల తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకెళ్లి పోలియోచుక్కలు వేయించాలని కోరారు.అందుకు అంగవైకల్యం నుండి పిల్లలను కాపాడాలని విజ్ఞప్తి చేసారు.నిర్దేశించిన రూట్ల వారీగా 27 మొబైల్బందాలు గుర్తించిన చిన్నారుల ఇండ్లకు వెళ్లి చుక్కలు వేశామన్నారు.జిల్లాలో 809 హైరిస్క్ ప్రాంతాలను గుర్తించామని, తప్పకుండా అక్కడ పోలియో చుక్కలు చిన్నారులకు అందాలని వైద్యాధికారులు ఆదేశించారు.ప్రయాణాలలో ఉన్న పిల్లలకు కూడా పోలియో చుక్కలు వేయాలని సూచించారు.జిల్లాలో 1,033 మంది ఆశా కార్యకర్తలు,348 ఏఎంఎంలు, 1,309 అంగన్వాడీటీచర్లు,572 మంది వాలంటరీలు పోలియో కార్యక్రమంలో చిన్నారులకు పోలియోచుక్కలు వేశామన్నారు.అందుకు తల్లిదండ్రులు పూర్తిగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.ప్రతిఒక్కరూ ఐదేండ్లలోపు ఉన్న పిల్లలకు తల్లిదండ్రులు విధిగా పోలియోచుక్కలు వేయించి వారిని అంగవైకల్యం నుంచి కాపాడాలన్నారు.జిల్లాకేంద్రంలోని జనరల్ఆస్పత్రిలో కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా వైద్యసేవలు అందిస్తున్నామన్నారు.పిల్లల మెరుగైన వైద్యసేవల కోసం చిన్నారుల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ కోటాచలం, ఏరియాస్పత్రి పర్యవేక్షకులు డా.మురళీధర్‌రెడ్డి,డీఐవో డా.వెంకటరమణ, పలువురు వైద్యాధికారులు, పలువురు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.