Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి
నల్లగొండ : మహిళలకు పని గంటలు తగ్గించడం, మెరుగైన వేతనం అందించడం, ఓటు హక్కు కొరకు మహిళలంతా పోరాడిన రోజే అంతర్జాతీయ మహిళ దినోత్సవం అని, జిల్లా వ్యాప్తంగా ఐద్వా ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించనున్నట్లు ఐద్వా జిల్లా కార్యదర్శి పాలడుగు ప్రభావతి తెలిపారు. ఆదివారం ఐద్వా ఆధ్వర్యంలో కట్టంగూర్ మండలం కురుమర్తి గ్రామంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ప్రభావతి మాట్లాడుతూ 1908 లో పోరాడి సాధించుకున్న హక్కుల వలన నేడు మహిళల గౌరవాన్నీ పెంపొందించిందని అన్నారు. మహిళా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా సహాయ కార్యదర్శి జిట్ట సరోజ మరియు మహిళలు పాల్గొన్నారు.