Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భువనగిరిరూరల్ :భువనగిరి మండలంలోని గౌస్‌నగర్ గ్రామానికి చెందిన విద్యార్థులు ఎస్.స్పూర్తి, వి.రేవతి, పి.హారికలు బండసోమారం పాఠశాలకు నడుచుకుంటూ వెళ్తుండగా గమనించిన కలెక్టర్ వారికి సైకిళ్లు అందజేస్తామని హామీనిచ్చారు. హామీ మేరకు గ్రామీణ అభివృద్ధి సంస్థద్వారా మంజూరైన సైకిళ్లను సోమవారం కలెక్టర్ కార్యాలయంలో విద్యార్థులకు పంపిణీచేశారు. బాగా చదువుకొని ఉన్నత స్థానానికి ఎదగాలని వారిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ డి. శ్రీనివాస్ రెడ్డి, జిల్లా గ్రామీణ అభివద్ధి అధికారి ఎం. ఉపేందర్ రెడ్డి, బండ సోమారం జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు విజయేందర్ రెడ్డి, తెలుగు పండిట్ బాలయ్య పాల్గొన్నారు.