Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ రాష్ట్ర ఉపాధ్యక్షులు కొండమడుగు నర్సింహ
యాదగిరిగుట్ట:ఈనెల 3,4 తేదీల్లో యాదగిరిగుట్ట పట్టణంలో నిర్వహిస్తున్న వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర విస్తతస్థాయి సమావేశాలను జయప్రదం చేయాలని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొండమడుగు నర్సింహ కోరారు.సోమవారం పట్టణంలోని వేదాద్రి పంక్షన్ హాల్లో సమావేశాల కరపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్,కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా పేదలకు భారంగా ఉన్నదని విమర్శించారు. ప్రభుత్వ రంగస్థలం ప్రయివేటు పరం చేస్తూ కార్పొరేట్ శక్తులకు అనేక రాయితీలు వస్తున్న పరిస్థితి ఉన్నదన్నారు.మోడీ ప్రభుత్వం రూ. 39 లక్షల కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజా సంక్షేమాన్ని విస్మరించి కార్పొరేట్ శక్తులకు వరాలను కురిపించిందన్నారు. ఉపాధి హామీ చట్టం పనులకు గతేడాది రూ 98 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తే, ఈసారి బడ్జెట్లో అధిక నిధులను పెంచకపోగా 73 వేల కోట్లకు కుదించడం దారుణమన్నారు. ఈ విస్తత స్థాయి సమావేశాలకు ముఖ్య అతిథులుగా అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, జాతీయ కమిటీ సభ్యులు జి. నాగయ్య, రాష్ట్ర అధ్యక్షులు బుర్రి ప్రసాద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. వెంకట్ రాములు గార్లతోపాటు 200 ప్రతినిధులు పాల్గొంటున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మంగ నరసింహులు,సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు బబ్బురి పోషేట్టి, పెద్ద కందుకూరు గ్రామ సర్పంచ్ భీమగాని రాములు, పెద్దకందుకూరు పాల సంఘం చైర్మన్ జోగు శ్రీను, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు గుర్రం కిష్టయ్య, సుబ్బురు