Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- వలిగొండ
స్థానిక పోలీస్ స్టేషన్ క్రాస్‌రోడ్ వద్ద రోడ్డు గుంతలమయంగా మారిందని వెంటనే మరమ్మతులు చేపట్టాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి సిరిపని స్వామి డిమాండ్ చేశారు. సోమవారం తహసీల్దార్ శ్యాంసుందర్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ అడ్డగూడూరు చిన్నగూడూరు జానకిపురం నుండి ఇసుక లారీలు రావడం వల్ల మోత్కూర్ నుండి వలిగొండ వరకు రోడ్డు గుంతలమయంగా మారిందన్నారు. వెంటనే మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి వర్గ సభ్యులు రామ్ చందర్. కూర శ్రీనివాస్. నాయకులు సురేష్. పట్టణ కార్యదర్శి గర్దాస్ నరసింహ .దొడ్డి బిక్షపతి. వేముల లక్ష్మయ్య .జ్ఞాన బోయిన యాదగిరి. తదితరులు పాల్గొన్నారు.