Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ వత్తిదారులకు జనాభా దామాషా ప్రాతిపదికన బడ్జెట్లో నిధులు కేటాయించాలి
అ జీఎంపీఎస్ జిల్లా కార్యదర్శి మద్దెపురం రాజు
నవతెలంగాణ-గుండాల
రెండో విడత గొర్రెల పంపిణీ వెంటనే చేపట్టాలని గొర్రెలు మేకల పెంపకందార్ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దెపురం రాజు డిమాండ్ చేశారు.సోమవారం గుండాల మండల పరిధిలోని మరిపడిగ గ్రామంలో గొర్రెల మేకల పెంపకందారుల సంఘం సమావేశం లింగంపల్లి పరశురాములు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ పథకంలో 7.30లక్షల మంది గొల్ల,కురుమలను లబ్దిదారులుగా ఎంపిక చేసి ఐదేండ్లు కావస్తున్నా ఇప్పటివరకు కేవలం 3.80 లక్షల మందికే పంపిణీ చేసిందని తెలిపారు. వత్తిదారులకు జనాభా దామాషా ప్రాతిపదికన రాష్ట్ర బడ్జెటులో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలొచ్చిన ప్రతీసారి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మీడియా ముందుకు వచ్చి త్వరలో గొర్రెల పంపిణీ అంటూ ప్రకటించటం పరిపాటిగా మారిందని విమర్శించారు. వత్తి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణించే గొర్రెల,మేకల పెంపకందారులకు పది లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏప్రిల్ 17,18,19 తేదీల్లో సంఘం రాష్ట్ర మహాసభలు భువనగిరిలో నిర్వహించాలని,మార్చి నెల మొత్తం మందలవద్ద గొర్ల కాపరులను కలిసి సమస్యలు అధ్యయనం చేయాలని నిర్ణయించామని తెలిపారు. ఈ సమావేశంలో లింగంపల్లి పెద్ద పరుశరాములు,బోయిని సోమేశ్వర్,యండి యాకూబ్,కొండెబోయిన బిక్షపతి,జెటంగి మల్లయ్య,బొంగు నర్సయ్య, కొండయ్య, లక్ష్మయ్య, మహేష్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.