Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఆవాజ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన
నవతెలంగాణ -నల్లగొండ
రాష్ట్ర బడ్జెట్లో మైనారిటీల సంక్షేమానికి రూ.5వేలకోట్లు కేటాయించాలని ఆవాజ్ జిల్లా అధ్యక్షులు,కార్యదర్శి మహ్మద్ అంజద్, సయ్యద్ హషం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు .సోమవారం కల్టెరేట్ ఎదుట ఆవాజ్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్ 2022-23లో మైనారిటీల సంక్షేమానికి చిన్న చిన్న వత్తులు చేసుకొని జీవిస్తున్న వారికి వీధి వ్యాపారులకు, మహిళలకు నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయం అందించే విధంగా బడ్జెట్లో రూ.5 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఎనిమిదేండ్ల కాలంలో 12 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లో 15 శాతం జనాభా కలిగి ఉన్న మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది 6500 కోట్లు మాత్రమేనని అన్నారు. ఇది చాలా అన్యాయమన్నారు. స్కాలరిషిప్, మైనారిటీ గురుకులాలు మినహా మైనార్టీ సంక్షేమానికి పెద్ద కేటాయింపులు చేయడం లేదన్నారు. లక్షల కోట్ల రూపాయల విలువైన వక్ఫ్ బోర్డు ఆస్తులు ఆక్రమణ గురవుతున్నాయన్నారు. నిధుల్లేక, ప్రభుత్వ విధానం సరిగా లేక వక్ఫ్ భూముల సర్వే ఆగిపోయిందన్నారు. డ్రైవర్ సాధికారత, డ్రైవర్ కమ్ ఓనర్ పథకాలు ప్రారంభించి ఆపేశారని అన్నారు. ఆర్థికంగా చితికిపోయిన విద్యా ఉద్యోగాల్లో వెనుకబడిన మైనార్టీలు అభివద్ధి చెందాలంటే బడ్జెట్లో నిధులు పెంచాలని డిమాండ్ చేశారు. దశలవారీ పోరాటంలో భాగంగా ఈనెల 28న కలెక్టరేట్ ఎదుట జరిగే ధర్నాలో మైనారిటీ ఉద్యోగ ,మహిళా, యువత, చిరువ్యాపారులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆవాజ్ జిల్లా కోశాధికారి,మహబూబ్ అలీ, నాయకులు మహమ్మద్ ఇక్బాల్ నాయకులు పాల్గొన్నారు.