Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి
నవతెలంగాణ-బీబీనగర్
రాష్ట్రంలో పేద ప్రజల సంక్షేమమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలకేంద్రంలోని మండలపరిషత్తు కార్యాలయంలో ప్రభుత్వం నుండి మంజూరైన కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను 37 మంది లబ్ధిదారులకు పంపిణీచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదింటి ఆడపడుచులకు కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకం వరంలాంటిదన్నారు. అనంతరం లబ్ధిదారులతో కలిసి ఎమ్మెల్యే సహపంక్తి భోజనంచేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఎరుకలి సుధాకర్‌గౌడ్, జడ్పీటీసీ గోళి ప్రణీతపింగల్రెడ్డి, పీఏసీఎస్ ఛైర్మన్ మెట్టు శ్రీనివాస్‌రెడ్డి, స్థానిక సర్పంచ్ మల్లగారి భాగ్యలక్ష్మీశ్రీనివాస్, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాచమల్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.